Adani Power Limited భారతదేశంలో అతిపెద్ద ప్రైవేట్ థర్మల్ పవర్ కంపెనీలలో ఒకటి. ఇది ప్రస్తుతం 17 GW కంటే ఎక్కువ సామర్థ్యంతో పనిచేస్తోంది. గోద్దా ప్రాజెక్ట్ ద్వారా బంగ్లాదేశ్‌కి విద్యుత్ సరఫరా చేస్తూ అంతర్జాతీయ స్థాయిలో కూడా తన మార్కెట్‌ను విస్తరిస్తోంది.

Adani Power Q1 Results (FY26)

2025 ఏప్రిల్–జూన్ త్రైమాసికం (Q1 FY26)లో Adani Power results ఇలా ఉన్నాయి:

  • Net Profit : ₹3,305 కోట్లు (గత సంవత్సరం పోల్చితే 15.5% తక్కువ)
  • Revenue: ₹14,109 కోట్లు (సుమారు 5.6% తగ్గింది)

లాభం తగ్గడానికి కారణాలు:

  • మార్కెట్‌లో తక్కువ merchant tariffs
  • కొత్తగా కొనుగోలు చేసిన ప్లాంట్ల వలన పెరిగిన ఖర్చులు
  • ముందుగానే వచ్చిన వర్షాలతో విద్యుత్ డిమాండ్ తగ్గిపోవడం
  • దిగుమతి బొగ్గు ధరల పెరుగుదల

ముఖ్యమైన అంశం ఏమిటంటే, కంపెనీ 5:1 Stock Split ప్రకటించింది. అంటే ఒక ₹10 విలువ గల షేరు, ₹2 విలువ గల 5 షేర్లుగా విభజించబడుతుంది. ఇది Adani Power share price చిన్న ఇన్వెస్టర్లకు మరింత అందుబాటులోకి తెస్తుంది.

Adani Power FY25 Highlights

గత సంవత్సరం (FY25) కంపెనీ బలమైన వృద్ధి సాధించింది:

  • విద్యుత్ ఉత్పత్తి 19.5% పెరిగి 102.2 బిలియన్ యూనిట్లు
  • విద్యుత్ అమ్మకాలు 20.7% పెరిగి 95.9 బిలియన్ యూనిట్లు
  • మొత్తం ఆదాయం 10.8% పెరిగి ₹56,473 కోట్లు
  • EBITDA 14.8% పెరిగి ₹21,575 కోట్లు
  • పన్ను ముందు లాభం (PBT) 21.4% పెరిగి ₹13,926 కోట్లు

Net Worth 30.6% పెరిగింది, అలాగే Cash Flow from Operations 51.7% పెరిగి కంపెనీ ఆర్థికంగా బలపడింది.

Adani Power Stock Growth Drivers

  1. Long-Term PPAs – సామర్థ్యంలో 80% దీర్ఘకాల ఒప్పందాల్లో ఉండటం వల్ల స్థిరమైన ఆదాయం వస్తుంది.
  2. Capacity Expansion – FY24లో 15.25 GW నుండి FY25లో 17.55 GWకి పెరిగింది. 2030 నాటికి 30 GW లక్ష్యం.
  3. Sector Demand – దేశంలో విద్యుత్ డిమాండ్ వేగంగా పెరుగుతోంది.
  4. Strong Financials – బలమైన క్యాష్ ఫ్లోలు, అప్పులు తగ్గడం వృద్ధిని మరింత బలపరుస్తున్నాయి.
  5. Positive Investor Sentiment – Promoters, Foreign Investors వాటాలను పెంచడం నమ్మకాన్ని చూపిస్తోంది.

Adani Power Stock Risks

  • బొగ్గు ధరల మార్పులు & మార్కెట్ ధరలు తక్షణ లాభాలపై ప్రభావం చూపవచ్చు.
  • బొగ్గు ఆధారిత విద్యుత్ కారణంగా భవిష్యత్తులో పర్యావరణ నియంత్రణలు పెరగవచ్చు.
  • Adani Group పై ఉన్న వివాదాలు, ఇన్వెస్టర్ నమ్మకాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది.